ప్రజలదే తుది నిర్ణయం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఇక విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రభుత్వం భూ సేకరణకు 123 జీవో తీసుకు వచ్చింది. దీనిపై ప్రజల్లో కొంతమంది సానుకూలత వ్యక్తం చేయగా ఎక్కువ మంది వ్యతిరేకించారు. ప్రతి పక్షాలు కూడా ప్రజలకు మద్దతునిస్తూ పోరాటం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలకు క్రమంగా ప్రజల నుండి మద్దతు పెరుగుతుండడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్ రావుతో తన అధికారిక నివాసంలో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూ సమీకరణకు రెండు విధానాలు అమలులో ఉన్నాయి అవి, 2013లో కేంద్రం తెచ్చిన భూ సమీకరణ చట్టం కాగా, రెండవది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 123. వీటిలో ప్రజలు ఏది కోరుకుంటే దాని ప్రకారమే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. 2013 చట్టం ప్రకారం కోరుకున్న వ్యక్తికి దాని ప్రకారం, జీవో 123 ప్రకారం కోరుకున్న వారికి దాని ప్రకారం పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply