సంగా రెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..

కాంగ్రెస్ నేత, సంగా రెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష జరిపేందుకు వెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం సంగా రెడ్డిలోని ఆర్అండ్ బీ అతిథి గృహం వద్ద జగ్గా రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించడానికి సిద్దం అవగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాంతో జగ్గారెడ్డి వర్గీయులు పోలీసులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. జగారెడ్డి మద్దతుదారుల నినాదాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా జగ్గారెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Leave a Reply