స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు…

తెలంగాణలో జిల్లాల పునర్విభజన చిచ్చు పెడుతుంది. పలువురు నాయకులు తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయమని ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా జనగాం, గద్వాల్ లాంటి చోట్ల పలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గద్వాల్ ను జిల్లా చేయాలని కోరుతూ ఎమెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ 44 పై ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో ఆలంపూర్ ఎమెల్యే సంపత్ కుమార్ తో పాటు అఖిలపక్ష నాయకులు,  భారి సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పోలీసులు చేసేదేం లేక డీకే అరుణను, సంపత్ ను అరెస్ట్ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Leave a Reply