చెప్పే స్థాయిలో ఉన్నా, చెప్పించుకునే స్థితిలో లేను – కోదండరాం

గత కొన్ని రోజులుగా టిజేఏసి చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోదండరాంపై మంత్రులు,తెరాస శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై జేఏసి స్టీరింగ్ కమిటీలో చర్చించిన అనంతరం మాట్లాడిన కోదండరాం మంత్రుల వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రజలే జేఏసికి మద్దతు అని, వేరే ఏ పార్టీల మద్దతు అవసరం లేదని తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై సాక్షాత్తూ న్యాయముర్తులే పోరాడవలసిన పరిస్థితి కల్పించారని విమర్శించారు. నిజాం షుగర్స్ కు మద్దతుగా జేఏసి పోరాడుతుందని కోదండరాం తెలిపారు. జేఏసిని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని, దాడులు జరిగినా వెనకడుగు వేసేదిలేదని, వ్యవసాయం,కులవృత్తులు,ఓపెన్ కాస్ట్ సమస్యలపై పోరాడతామని కోదండరాం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో త్వరలోనే సమావేశం అవుతామని, విద్యార్థుల సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. తాను నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నా, కాని చెప్పించుకునే స్థాయిలో లేనని కోదండరాం అన్నాడు.

Leave a Reply