తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తుంది – ప్రో. కోదండరాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన టీ. జేఏసీ చైర్మన్ కోదండరాం మరో సారి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ వర్ధంతిని అధికారికంగా జరపకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆగష్టు 6 తేదిన జయశంకర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించి తప్పు సరిదిద్దుకోవాలని కోదండరాం ప్రభుత్వానికి సూచించారు.మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము అండగా ఉంటాము అని, ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ ను బయటపెట్టాలని కోరారు. ఇప్పటి వరకు బాధితులను చట్ట ప్రకారం ఆదుకోలేదు అని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తున్నారని కోదండరాం అన్నారు. తాను కచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడతానని కోదండరాం స్పష్టం చేశారు.

Leave a Reply