ప్రజలకు మౌనమెందుకు..? కోదండరాం

గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న టి. జేఏసీ చైర్మన్ కోదండరాం ఇప్పుడు మరోసారి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అభివృద్ధి ఫలాలు అందరికి అందాలని, అందుకోసం తెలంగాణ కోసం ఉద్యమించిన వారంతా భాగస్వామ్యం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించడం ఒక ఎత్తని, అభివృద్ధి సాధించడం ఒక ఎత్తని కోదండరాం పేర్కొన్నారు. వలస పాలకులలాగా అభివృద్ధి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కేంద్రంగా జరగరాదని, అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరగాలని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే తాము కోరుకుంటున్నామని, విద్యావంతులు మౌనంగా ఉండకూడదు అని, వారు భాద్యత తీసుకొని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు.  తాము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని, ప్రతి విషయాన్ని విశ్లేషించిన తర్వాతే పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తామని కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నామని, ప్రజలు తమ ఆకాంక్షను అర్థం చేసుకోవాలని కోదండరాం కోరారు.

 

Leave a Reply