రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ది చేకురుస్తారా..?

జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో మీకు పరిపాలించడం చేత కాకపోతే తప్పుకోండి, మేము పరిపాలిస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొదందారం మళ్ళి ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలే చేశారు. టి. జేఏసీ కార్యలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొదండరాం జయశంకర్ కోరుకున్న తెలంగాణా ఇది కాదు అని, ప్రజలను వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు మేలు చేసే తెలంగాణను జయశంకర్ ఎప్పుడు కోరుకోలేదు అని కోదండరాం విమర్శించారు.

Leave a Reply