అవి బ్రతికేలా చర్యలు చేపట్టాలి – తెలంగాణ సిఎం కేసీఆర్

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టర్లను కోరారు. నాటిన మొక్కను బతికించి, పెద్ద చేసేందుకు అనుసరించే కార్యాచరణను రూపొందించాలని సిఎం ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న హరితహారం కార్యక్రమంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలందరూ భాగస్వాములు కావడం పట్ల సంతోషం తెలిపారు. మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగవడం చాలా ముఖ్యమని సిఎం చెప్పారు. మొక్కలను బతికించడం కోసం జిల్లాల వంతుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్లతో సమన్వయం కుదుర్చుకుని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ తయారు చేయాలని సిఎస్ ను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ పరిధిలో కూడా ఈ సారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని, వాటికి నీళ్లు పోయడం, రక్షించడం కోసం కూడ వారు బాధ్యత తీసుకోవాలని సిఎం కోరారు. ప్రతీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రభుత్వానికి నివేదిక పంపాలని, కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు.

 

 

Leave a Reply