పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న పథకం..

సూపర్ స్టార్ రజనీకాంత్, దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న నటుడు. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో అయితే రజనీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఉన్నారు. అక్కడ రజనీకాంత్ సినిమా టికెట్ దొరికితే పండగ చేసుకుంటారు. దీనిని ఉపయోగించుకొని పుదుచ్చేరి ప్రభుత్వం ఒక అధ్బుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. పుదుచ్చేరిలో దాదాపు 60 శాతం ప్రజలకు మరుగుదొడ్లు లేవు. దాంతో ప్రభుత్వం ‘మీ ఇంట్లో టాయిలెట్ నిర్మించండి, కబాలి టికెట్లు ఉచితంగా పొందండి’ అంటూ ఉచిత పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి స్పందన బాగానే వస్తుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి రజనీకాంత్ ను పుదుచ్చేరి స్వచ్ భారత్ కార్యక్రమానికి అంబాసిడర్ గా ఉండమని కోరారు.

Leave a Reply