ఏమైనా ఉపయోగం ఉంటుందా..?

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపటి నుండి నిరాహార దీక్ష చేయనున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్  లో రెండు రోజుల పాటు రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేయనున్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం మల్లన్న సాగర్ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేసే వరకు తాను పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ లను అడ్డుకుంటుందని కేసీరేవంత్ ఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని  రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి దీక్షకు ప్రజల నుండి ఎంత మద్దతు లభిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో మెజారిటీ ప్రజలు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి దీక్ష చేస్తాను అని ప్రకటించినా కూడా ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు.

Leave a Reply