మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కోదండరాంపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మంత్రులు కోదండరాం, రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారాడు అని వ్యాఖ్యానించడంతో రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించాడు. ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారు ఒకే విధంగా స్పందిస్తారని ఆ మాత్రం దానికే రేవంత్ రెడ్డి చేతిలో కోదండరాం కీలుబొమ్మగా మారాడనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. కోదండరాంపై విమర్శలు చేస్తున్న వారంతా ఎప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు పిచ్చికుక్కల్లా కొదందరాంపై అరుస్తుంటే కెసిఆర్ గుంటనక్కలా ఫాంహౌస్ లో దాక్కున్నాడని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. 24 గంటల్లో కోదండరాంకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave a Reply