తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మరో వరం..

తెలంగాణలో రాష్ట్ర విద్యార్థుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో భారీగా సీట్ల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.  దానివల్ల మరింత మంది విద్యార్థులు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడానికి అవకాశం లభించనుంది. ఈ మేరకు ప్రతి మోడల్ స్కూల్‌లోని 6 నుండి 10వ తరగతులలో సీట్లను 80 నుండి 100కు పెంచారు. అంటే మొత్తం సీట్లను 400 నుంచి 500కు పెంచారు. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరాలలో 100శాతం చొప్పున సీట్ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరాలలో 20 చొప్పున సీట్లు మాత్రమే భర్తీచేస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరాలలో సీట్లు 20 నుంచి 40కి పెరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి నూతన మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీచేశారు. మోడల్ స్కూల్‌లో ఉన్న 6-10 తరగతులకు, ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరాల తరగతులలో సీట్ల అడ్మిషన్లలో రిజర్వేషన్లు తప్పక అమలుచేస్తారు.

Leave a Reply