ఆల్‌ ఖైదా వెబ్ సైట్ లో కీలక సమాచారం

అమెరికాపై సెప్టెంబర్‌ 11 దాడుల కీలక సూత్రధారి,ఆల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ అమెరికా సైన్యం చేతిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఒసామా బిన్ లాడెన్ అప్పుడు మరణించలేదని ఇప్పుడు కొత్తగా వార్తలొస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం. ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరోకాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆల్‌ ఖైదా వ్యవహారాలపై పరిశోధన చేస్తున్న ఆల్‌ ఖైదా వ్యవహారాల నిపుణుడు డాక్టర్‌ రోహన్ గుణరత్నే. ఆల్‌ ఖైదా వ్యవహారాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ పూర్తిస్థాయిలో పరిశోధన నిర్వహిస్తున్న అతనికి మొన్న ఆల్ ఖైదా కి సంబంధించిన లేఖ కనిపించిందట. అయితే ఆ లేఖ ఆధారంగా ఒసామా బిన్ లాడెన్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని అంతటి శక్తివంతమైన పదజాలంతో లాడెన్ తప్ప మరొకరు లేఖను రాయలేరని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఈ విషయాలను పక్కన బెడితే మరోవైపు లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చేసిన ప్రకటన ప్రకారం తన తండ్రి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ప్రకటనలో తెలిపారు.అయితే ఈ విషయంపై ఆధారాలతో కూడిన పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

 

Leave a Reply