కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోబోతుంది. ఇక నుండి ఏ పరిశ్రమ ఎంత స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లుతుంది అనేటువంటి విషయాలను ఆన్ లైన్ లో పెట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఆన్ లైన్ మానిటరింగ్ సిస్టం ద్వారా కాలుష్య వివరాలు ఎల్లప్పుడూ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 334 ఫ్యాక్టరీల వివరాలు ఆన్ లైన్ లో పొండుపరచనున్నారు. దీని ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒక సారి కాలుష్య వివరాలను చూసి, అవి గనుక మోతాదును మించితే వెంటనే సదరు ఫ్యాక్టరీకి తెలియజేస్తారు. ఒక గంటలోపు సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా సదరు ఫ్యాక్టరీల కాలుష్యాన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తమ కార్యాలయం నుండే పరిశ్రమలను సమీక్షించవచ్చు. ఈ మొత్తం తతంగం పూర్తి అవ్వడానికి మరో మూడు నెలలు సమయం పట్టొచ్చు.

Leave a Reply