చంద్రబాబు కూడా ఆయన తర్వాతే…

నారాయణ 2014 ఎన్నికల ముందు కేవలం విద్యా సంస్థల అధినేత గానే తెలుసు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఒక వైపు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూనే, మరోవైపు రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణ భాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు నారాయణ దేశంలోని మంత్రులలో అత్యంత ధనిక మంత్రి. ఆయన ఆస్తి విలువ 496 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ వెల్లడించిన వివరాల ప్రకారం కుబేర మంత్రులలో నారాయణ మొదటి స్థానం, కర్నాటక మంత్రి శివ కుమార్ రెండవ స్థానం పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆస్తుల్లో నారాయణ వెనకే నిలవడం గమనార్హం. అలాగే మిగతా రాష్ట్రాల మంత్రుల ఆస్తులతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ మంత్రులే అగ్ర స్థాన్నాల్లో ఉన్నారు.

దేశవ్యాప్తంగా మంత్రుల సగటు ఆస్తి విలువ 8.59 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మంత్రుల సగటు ఆస్తుల విలువ 45.49 కోట్లు. తరవాతి స్థానంలో కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. చివరి స్థానలో త్రిపుర నిలిచింది. అక్కడి మంత్రుల సగటు ఆస్తుల విలువ 3 కోట్లు.

Leave a Reply