భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన డ్రాగన్ బలగాలు..

చైనా మరోసారి తన కవ్వింపు తనాన్ని చూపెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారత భూ భాగంలోకి దుసుకువచ్చి చైనా అనే బోర్డు పెట్టిన చైనా భద్రతా భద్రతా దళాలు ఇప్పుడు మరోసారి భారత భూ భాగంలోకి చొచ్చుకు వచ్చాయి.ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోకి చైనా బలగాలు చొచ్చుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్పష్టం చేశారు. చైనాతో 350 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లలో బరాహోతి ప్రాంతం వరకు ఈ నెల 15న డ్రాగన్ బలగాలు చొచ్చుకు వచ్చాయి. అయితే మన భూ భాగంలోకి వచ్చినప్పటికీ కీలకమైన కాలువ దగ్గరకు మాత్రం వెళ్ళలేక పోయాయి. ఇది భారత్ కు సంబంధించినంత వరకు మంచి విషయమే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కేంద్రాన్ని కోరారు.

Leave a Reply