ఎంసెట్ – 3 పై నేడు అధికారిక ప్రకటన

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంసెట్ – 2 వ్యవహారం విద్యార్థులకు మరో పరీక్షను తెచ్చిపట్టింది. ఇప్పటికే మంచి ర్యాంకులు పొంది కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మరో అగ్ని పరీక్షలా ఎంసెట్ – 3 రాబోతుంది. ఎంసెట్ – 2లో కొంతమంది విద్యార్థులు అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు ధృవీకరించడంతో ప్రభుత్వం మరోమారు ఎంసెట్ పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో గాని, ఆగష్టు చివరి వారంలోగాని పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి అనుమతితో అధికారులు నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. ఎంసెట్ లీక్ కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలని, ఎంతటి వారైనా ఉపెక్షించవద్దని ముఖ్యమంత్రి డీజీపీకి సూచించారు.

Leave a Reply