ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన ఎర్రవెల్లి గ్రామస్తులు..

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విషయంలో ప్రతి పక్షాలు చేస్తున్న పోరాటానికి మొదట్లో ప్రజల నుండి మద్దతు లభించినా రాను రాను వారికి ప్రజల నుండి మద్దతు లభించడం లేదు. 123 జీవో ప్రకారం కాకుండా, 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే, ప్రభుత్వం ప్రజలు ఏ రకంగా పరిహారం కోరితే ఆ రకంగా పరిహారం చల్లిస్తామని ప్రకటించారు. కొంత మంది 123 జీవో ప్రకారం, మరికొంత మంది 2013 చట్టం ప్రకారం పరిహారం పొందారు. అయితే 2013 చట్టం ప్రకారం పరిహారం పొందిన వారితో పోల్చితే, 12 3 జీవో ప్రకారం పరిహారం పొందిన వారికి ఎక్కువ మేలు జరిగింది. దాంతో ప్రతిపక్షాల మాట విని మోసపోయినట్లు గమనించిన ప్రజలు వారికి చుక్కలు చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఎర్రవెల్లి గ్రామస్తులు తమ ఊరి పొలిమేరల్లో ప్రతిపక్షాలు తమ ఊరికి రావోద్దంటూ పలకపై రాసి తగిలించారు. ప్రతిపక్షాల మాట విని తాము మోసపోయామని ఎర్రవెల్లి గ్రామస్తులు వాపోతున్నారు. వీరి బాధను గమనించిన తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వారికి 123 జీవో ప్రకారమే పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

Leave a Reply