విగ్రహాల ఎత్తు కూడా తగ్గే అవకాశం…

హైదరాబాద్ నగరంలో ఇకపై జరిగే వినాయక నిమజ్జనాలను ప్రత్యక కొలనుల్లో చేయనున్నారు. వినాయక నిమజ్జనంపై హై కోర్ట్ లో దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తమ వాదనలు వినిపిస్తూ హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాన్ని ప్రత్యేక కొలనుల్లోనే జరిగేలా చూస్తామని జీహెచ్ఎంసీ తెలిపింది. 10 వరకు ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో మూడింటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి అని జీహెచ్ఎంసీ తన వాదనలో పేర్కొంది. హై కోర్ట్ విగ్రహాల ఎత్తుపై గణేష్ మండపాల నిర్వాహకులను చైతన్య పరచాలని జీహెచ్ఎంసీకి సూచించింది. హై కోర్ట్ తదుపరి విచారణను 12 వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply