రజనీ కాంత్ కు నోటీసులు..

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారి అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. విడుదల తేది దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ చిత్రానికి అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రజనీ కాంత్ నటించిన లింగ చిత్ర పంపిణి దారులు చిత్రాన్ని విడుదల చెయ్యొద్దు అంటూ చెన్నై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.రేపు కబాలి విడుదల అవ్వకుండా చూడాలని కోర్ట్ ను కోరారు. దాంతో చెన్నై హై కోర్ట్ రజనీకాంత్ కు నోటిసులు పంపించింది. లింగ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆ చిత్ర పంపిణి దారులకు భారి నష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ తమను ఆదుకోవాలంటూ కోర్ట్ కు వెళ్ళారు.  దీనిపై రజనీ కాంత్ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Leave a Reply