ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు నిరాశ..

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు భారీగా వలసలను ప్రోత్సహించారు. ఆ సమయంలో సొంత పార్టీ నుండి వ్యతిరేకత వస్తే ఇద్దరు చంద్రుల్లు కూడా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అప్పుడు అందరికి అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే వారి ఆశలపై కేంద్రం నీళ్ళు చల్లింది. టీడీపీ ఎంపీ టీ. దేవేందర్ గౌడ్ అసెంబ్లీలో సీట్ల పెంపుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170 ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల ఇప్పట్లో సీట్ల పెంపు ఉండదని, 2026 వరకు ఇవే సీట్లు కొనసాగుతాయని లేఖలో తెలిపారు. అయితే కాంగ్రెస్,బీజేపీలు ఏకాభిప్రాయానికి వస్తే రాజ్యాంగ సవరణ సాధ్యమే అని అంటున్నారు విశ్లేషకులు.

Leave a Reply