పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి…

నరేంద్ర మోడీ తెలంగాణలో ప్రధాని హోదాలో తొలిసారిగా పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానికి ఘనమైన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాని పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్ లో మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే భారి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

అయితే గజ్వేల్ లో జరుగుతున్న బహిరంగ సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. మంత్రి హరీష్ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి ప్రజలను సమీకరించేందుకు హరీష్ రావు కృషి చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర సీఎస్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి సభాప్రాంగాణాన్ని హరీష్ రావు పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బహిరంగసభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని తెలిపారు.

Leave a Reply