మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి..

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ జిల్లా హత్నూర్ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ రెసిడెన్షియల్ భవనాన్ని ప్రారంభించారు. కాలేజీ ప్ర్రాంగణంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రజలంతా దానిని ముందుకు తీసుకుపోవాలని హరీష్ రావు ప్రజలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని 4400 చెరువులు పొంగిపోర్లాయని, అదే మెదక్ లో అసలు వానలే పడలేదని, అందుకు కారణం మెదక్ లో అడవులు లేకపోవటమే అని వ్యాఖ్యానించారు. అందుకని చెట్లు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. అందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Leave a Reply