కాన్సర్ తో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన అభిమానులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాన్సర్ తో బాధ పడుతున్న తన అభిమాని చివరి కోరిక తీర్చేందుకు స్వయంగా వెళ్ళారు. ఇక వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు చెందిన నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. అతను కొంతకాలంగా ఉపిరితిత్తుల కాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన తన చివరి కోరికగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవాలని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా నాగార్జున ఇంటికి వెళ్ళి అతడిని పరామర్శించారు. అంతే కాకుండా స్వయంగా అతనికి సపర్యలు చేసి తన మానవతా దృక్పథాన్నీ చాటుకున్నారు.

Leave a Reply