ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందాలన్నదే లక్ష్యం..

తెలంగాణలోని ప్రతి గ్రామానికి వైద్యం అందడమే తమ లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంపిలతో సమావేశం అయిన కేసీఆర్ తమ నియోజకవర్గాల్లో తగిన వైద్య సదుపాయాలూ లేని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఎంపిలు చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వం తరపున 80 లక్షల నుండి 1 కోటి వరకు ఆర్ధిక సాయం అందజేస్తామని, కార్పొరేట్ ఆస్పత్రులను, ఎన్జీవోలను, వైద్య కళాశాలలను సంప్రదించి తగిన ఆర్ధిక వనరులను, ఇతర సదుపాయాలను సమకూర్చుకోవాలని కేసీఆర్ ఎంపిలకు సూచించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి గిరిజనులు,ఆదివాసీలు, బాగా వెనుకబడిన గ్రామాలు, దళితులు, సంచార జాతులు నివాసం ఉండే ప్రాంతాల్లో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ తెలిపారు.

Leave a Reply