మీ సేవలో మరో 24 ప్రభుత్వ సేవలు..

సామాన్యులకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. నేటితో మీ సేవ 7 కోట్ల రూపాయల లావాదేవీలను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పాలనను అందుబాటులోకి తీసుకురావడంలో మీసేవ పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ప్రజలకు అవినీతి రహితంగా సేవలు అందించడంలో మీసేవ ముందు వరుసలో ఉందని ఆయన అభినందించారు. అలాగే మీ సేవలో మరో 24 కొత్త సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Leave a Reply