తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి..

మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో సరసన నివాలని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని కోసర్ ఫార్మా ఆవరణలో మంత్రి హరీష్ రావు హరిత హారం కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ప్రపంచంలోనే కెనడాలో తలసరి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అని, అదే తెలంగాణలో అతి తక్కువగా ఉన్నాయి అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల ఆవరణలో మొక్కలు నాటాలని, రాష్ట్రంలోని ప్రజలంతా ఏకమై మొక్కలు పెంచి తెలంగాణను మొక్కల పెంపకంలో అగ్రదేశాల సరసన నిలపాలని హరీష్ రావు కోరారు.

Leave a Reply