సిద్ధిపేటలో మొక్కలు నాటి హరిత హారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు మెదక్ జిల్లాలోని సిద్ధిపేట చుట్టుపక్కల గ్రామాల్లో హరిత హారంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఊరి ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి హరిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించాలని కోరారు.నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా తీసుకుని పర్యవేక్షించాలని ప్రతి మొక్క చెట్టుగా మారేవరకు బాధ్యత తీసుకోవాలని అన్నారు. హరిత హారం ద్వారా ఇన్ని మొక్కలు నాటి రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పెంచాలని చెట్ల వల్లే వర్షాలు బాగా వస్తాయని ప్రతి ఒక్కరు తప్పని సరిగా నిర్లక్ష్యం వహించకుండా ఉద్యమంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Harishrao Haritha Haram 2 Harishrao Haritha Haram Haritha haram

Leave a Reply