ఈ సారి లోకేష్ కు అవకాశం..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ లో ప్రస్తుతం చంద్రబాబు తో కలిపి 22 మంది మంత్రులు ఉన్నారు. శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మరో ముగ్గురికి అవకాశం ఇవ్వొచ్చు. కొత్తగా వచ్చే ముగ్గురు మంత్రులలో లోకేష్ ఖచ్చితంగా ఉంటారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఇద్దరిలో ఒకటి వైసిపి నుండి వచ్చిన ఎమ్మెల్యేలలో ఒకరికి అవకాశం ఇస్తారని, మిగిలినది మైనార్టీలకు కేటాయిస్తారని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే గిరిజనుల నుండి ఎపి మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఆ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఆగష్టు చివరి వారంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

Leave a Reply