బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా గజ్వేల్ లో మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించడంతో పాటు మొదటి నల్లాను ప్రారంభిస్తారు. అనంతరం జరిగే మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. రామగుండంలో నూతనంగా నిర్మించిన 16 వందల మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను రిమోట్ ద్వారా మోడీ ప్రారంభిస్తారు. అలాగే రామగుండంలో నిర్మించతలపెట్టిన ఫెర్టిలైజర్ ప్లాంట్ కు, వరంగల్ కాళోజీ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.

pm tour in telangana

ఈ కార్యక్రమం అనంతరం బిజెపి పార్టీ బూత్ స్థాయి బహిరంగసభలో పాల్గొంటారు.

Leave a Reply