గజ్వేల్ కు మాత్రమే పరిమితం..

నరేంద్ర మోదీ తెలంగాణలో తొలిసారిగా ప్రధాన మంత్రి హోదాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన వివరాలను పీఎంఓ అధికారికంగా విడుదల చేసింది. ఆగష్టు 7వ తేదిన మోదీ మెదక్ జిల్లా గజ్వేల్ కు రానున్నారు. ఆయన ఆ రోజు మధ్యాహ్నం ౩ గంటలకు గజ్వేల్ కు చేరుకొని, మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం 4 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకొని 5 గంటలకు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ప్రధాని పర్యటన పై తెలంగాణ ప్రభుత్వ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రధాని చేత ఎన్నో పథకాలకు ప్రారంభం చేయించాలని అనుకున్నప్పటికీ ప్రధాని కేవలం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ కు మాత్రమే పరిమితం అవడంతో వారు అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం.

Leave a Reply