మోదీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే…

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజీనామా వ్యవహారం ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గుజరాత్ ను మోడీ 13 సంవత్సరాలు పరిపాలించారని, అప్పుడు మోడీ చేసిన నిర్వాకంతోనే గుజరాత్ ఇప్పుడు రావణ కాష్టంలా మండిపోతుంది అని రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆనందీ బెన్ పటేల్ ను రాజీనామా చేయించారని రాహుల్ గాంధీ తెలిపారు. మోడీకి గుజరాత్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతారని విమర్శించారు. గుజరాత్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అసలు గుజరాత్ లో ఏం జరుగుతుందో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయ పడ్డారు.

Leave a Reply