చంద్రబాబు నాయుడు ఏదో తేడాగా చేస్తున్నారు..

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాల రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రబుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతున్నారని, హైదరాబాద్ లో సగం కూడా లేని సింగపూర్ ను ఒక నందనవనంగా చుపెడుతున్నారని, ప్రపంచంలో ఎక్కడ కేసు జరిగిన దాని వెనుక సింగపూర్ కంపనీలు ఉన్నట్లు వెల్లడవుతుందని ఉండవల్లి తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 1500 ఎకరాలు సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని, హైదరాబాద్ లో మొత్తం ప్రభుత్వ స్థలాలు 2000 ఎకరాలకు మించి లేదని అటువంటిది 35000 ఎందుకని ప్రశ్నించారు. సంవత్సరానికి మూడు పంటలు పడే భూములను బలవంతంగా ఎందుకు తీసుకుంటున్నారో అని, రాష్ట్రంలో చంద్రబాబు ఎదో తేడా చేస్తున్నాడని, ప్రజలు, తెలుగుదేశం నేతలు గమనించాలని సూచించారు.

Leave a Reply