తెరాసా కు కొవర్ట్ గా కాంగ్రెస్ నేత…?

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్ష పార్టీలు కుదేలయ్యాయి.మొన్నటి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసిన అధికారపార్టీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వైపు తన దృష్టి మరల్చింది.తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ఆ పార్టీనుండి అప్పట్లో ఎర్రబెల్లి దయకర్ రావు టీఆర్ యస్ పార్టీకి కొవర్ట్ గా ఉండి మొత్తం కధ అంతా నడిపించాడని వాదనలు ఉన్నాయి.అతను ముందు తన అనుచరులను తెరాసా లోకి పంపి తర్వాత తాను వద్దామనే ఉద్దేశ్యంతో పార్తీని మొత్తం ఖాళీ చేసాడని తేదేపా నాయకులు చెప్పుకుంటున్నారు.ఐతే ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది.కాంగ్రేస్ లో ఓ ముఖ్య నేత ఈ పనికి పూనుకున్నాడని తెలుస్తుంది.అతను సుదీర్ఘంగా కాంగ్రేస్ లో పదవులు అనుభవించిన నాయకుడు అని కొందరు చెప్పుకుంటున్నారు.గత కొన్ని రోజులుగా కాంగ్రేస్ అతన్ని పట్టించుకోవడం లేదని,సీనియర్ ఐనప్పటికి తనకు తగిన ప్రాదాన్యత ఇవ్వటం లేదని భావించిన అతను తన అనుచరులను ఒక్కొక్కలను అదికారపార్టీలోకి పంపిస్తున్నాడని కాంగ్రేస్ లోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశం అదిష్టానం దగ్గరకు చేరిందని కొందరు చెప్పుకుంటున్నారు.

Leave a Reply