ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..

నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ యూఐ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఉపకార వేతనాలు చెల్లించడం లేదని, హాస్టల్ సమస్యలు, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవటం, తదితర సమస్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ ప్రవేశాల్లో అవకతవకలు, ఎంసెట్ – 2 పేపర్ లీకేజ్ వంటి కుంభకోణాలు జరిగాయని ఉత్తమ్ ఆరోపించారు.

Leave a Reply