రెండు రోజులు ప్రయాణాలు మానుకోండి – మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాలకు వేరు వేరు చోట్ల ఏడుగురు మృతి చెందారు. వారి కుటుంబాలను కేటీఆర్  పరామర్శించి సానుభూతి ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక రెండు రోజుల పాటు అన్ని పనులకు, ప్రయాణాలకు విరామం ఇచ్చి ఇంట్లోనే ఉండాలని కోరారు.  జీహెచ్ఎంసీలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే కొన్ని పురాతన భవనాలను తొలగించామని మరికొన్ని, కోర్టు కేసుల మూలంగా తొలగించలేక పోయినట్లు కేటీఆర్ తెలిపారు.

Leave a Reply