ప్రత్యేక హోదా గురించి పట్టించుకోని ఎంపీలు..

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు మొత్తం ప్రజలు తీవ్రంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం ఓటింగ్ కు అనుమతించలేదు. దాంతో లోక్ సభలో, రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అయితే కొంతమంది ఎంపీలు ప్రత్యేక హోదా గురుంచి తమకేమి పట్టదన్నట్లుగా హాయిగా నిద్ర పోయారు. కనీసం తమకు ఓట్లేసిన ప్రజల గురుంచి ఆలోచనే లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇటువంటి ఎంపీలను పార్లమెంట్ కు పంపి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఆ పోరాటం ఎప్పుడు నిష్ప్రయోజనమే.

Leave a Reply