తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాను ఆంధ్రా నుండి దిశానిర్దేశం చేస్తున్నానని భావించవద్దని, ప్రతి నెల తెలంగాణ నేతల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలంగాణ నేతలతో వ్యాఖ్యానించారు. సొంత నిర్ణయాలతో పార్టీని బలోపేతం చేసుకోవాలని, అంతే కాని ప్రతి దానికి తనపై ఆధారపడవద్దని, తనను అర్థం చేసుకోవాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. తాను తెలంగాణను వదలలేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా అధికారం సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్యకర్తలు అధైర్యపడవద్దని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply