లోక్ సభలో ప్రవేశపెట్టనున్న వైఎసార్సీపీ..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్ రావు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ మాత్రం అది ద్రవ్య వినిమయ బిల్లు ముందుగా లోక్ సభలోనే ప్రవేశ పెట్టాలి అంటూ ఓటింగ్ కు అనుమతించలేదు. కేవలం చర్చ మాత్రమే జరిగింది.  అయితే లోక్ సభలో మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ బిల్లును ప్రవేశ పెట్టలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ఐన వైఎసార్సీపీ లోక్ సభలో ప్రత్యేక హోదా బిల్లు ప్రవేశ పెట్టనుంది. ఆగష్టు 5న వైఎసార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు బిల్లుపై ఖచ్చితంగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదాపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

Leave a Reply