ప్రధాని నేడు ప్రకటించే అవకాశం..

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరిస్తారన్న వార్తలు వస్తున్నాయి. అది కూడా ఈ రోజైనా, లేక రేపైనా జరిగే అవకాశం ఉంది అందుకు తగ్గట్లుగానే రాష్ట్రపతి భవన్ ను ముస్తాబు చేస్తున్నారు. పని సరిగ్గా చేయని కొంత మంది మంత్రులకు ఉద్వాసనతో పాటు, మరికొంత మంది కొత్త వారికి అవకాశం లభించనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామికి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఆర్ధిక శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే సుబ్రమణ్య స్వామి గత కొన్ని రోజులుగా ఆర్ధిక శాఖ పనితీరును అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply