సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీమ్ కోర్టు..

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజా క్షేత్రంలో ఉన్నవారు, రాజకీయాలలో ఉన్నవారు విమర్శలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక విషయానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత 5 సంవత్సరాలలో 213 పరువు నష్టం దావాలు వేశారు. దీనిని సుప్రీమ్ కోర్ట్ తీవ్రంగా ఆక్షేపించింది. జయలలిత ప్రభుత్వ యంత్రాంగాన్ని పరువు నష్టం దావాల కోసం వాడుకుంటున్నారని సుప్రీమ్ కోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి ఎన్నికల హామీల గురుంచి, ఆరోగ్యం గురించి, నీటి గురించి, సెలవుల గురుంచి విమర్శిస్తే పరువు నష్టం దావా వేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజా జీవితంలో ఉన్న వారు విమర్శలు ఎదుర్కోవాలని సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోరాదని సూచించింది.

Leave a Reply