ఆంద్రప్రదేశ్ – తమిళనాడు మధ్య మరో వివాదం..

గత కొన్ని రోజులుగా ఆంద్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక హోదాకు తమిళనాడు అడ్డుపడడం దగ్గర నుండి, శేషాచలం ఎన్ కౌంటర్ వరకు అనేక విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదం రాజుకుంది. తమిళనాడు – ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో, చిత్తూర్ జిల్లాలో పాలార్ నదిపై చెక్ డ్యాం ఎత్తును పెంచడంపై తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 అడుగుల ఎత్తు ఉన్న చెక్ డ్యాంను ఏకపక్షంగా 12 అడుగులకు ఏకపక్షంగా ఎందుకు పెంచారని జయలలిత ప్రశ్నించారు. పాలార్ నదిలో ఇప్పటికే నీళ్ళు తక్కువగా ఉన్నాయి అని, తమిళనాడులో ఆ నది కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని, ప్రజలకు తాగునీటితో పాటు, కల్పగం అణు విద్యుత్ కేంద్రానికి నీటిని సరాఫరా చేసే నదిపై ఎత్తును పెంచడం వల్ల తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని జయలిత తెలిపారు.

Leave a Reply