రాజకీయాలంటే గడ్డం గీసుకోవడం కాదు..

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతవారం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి అధికార ప్రతిపక్ష పార్టీల పైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ప్రతిగా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా బాగానే ప్రతిస్పందిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాన్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు పడుకొని లేచి ప్రత్యేక హోదాపై మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. తన అన్న చిరంజీవి పదవీ కాలం ముగుస్తున్నందు వల్లే ఎంపీలను రాజీనామా చేయాలని కోరుతున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, తమిళనాడులో ఇలా మాట్లాడితే జయలలిత కాళ్లు, చేతులు విరగోట్టించే వాళ్ళంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం అంటే గడ్డం చేసుకున్నంత ఈజీ కాదని, తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితేనే ఢిల్లీ పెద్దలకు అర్థమవుతుందని పవన్ చెప్పడం ఆయన అనుభవ రాహిత్యానికి నిదర్శనం అని టీజీ వెంకటేష్ తెలిపారు.

Leave a Reply