మిగులు బడ్జెట్ నుండి లోటు బడ్జెట్ లోకి తెలంగాణ రాష్ట్రం..

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌‌తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం లోటు బడ్జెట్‌లోకి పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూడకుండా ఫాంహౌస్‌లో పడుకుంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ.10 కోట్లు ఇచ్చామని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు తాము కూడా ఇచ్చామని చెబుతున్నారు అని, ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు . బంగారు తెలంగాణ అంటూ కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు అని లోకేష్ ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ చేయకపోవడానికి, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు చేయకుండా ఏ ఆంధ్రా పార్టీ అడ్డు పడ్డది అంటూ లోకేష్ నిలదీశారు.

 

Leave a Reply