ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లోకేష్..?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఇక తన మకాంను ఢిల్లీకి మార్చనున్నారా అంటే అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. లోకేష్ ను క్రియాశీలక రాజకీయాలలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పట్నునుంచో పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పట్లో లోకేష్ ను ప్రజా క్షేత్రంలోకి తీసుకొచ్చేలా కనపడటం లేదు. లోకేష్ ను ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్యాబినెట్ స్థాయి కలిగిన ఈ పదవిలో ప్రస్తుతం కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. ఆయన స్థానంలో లోకేష్ ను నియమించే అవకాశం ఉంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఢిల్లీలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం జనపథ్ లో ఆయనకు ఇంటిని కేటాయించింది. ప్రస్తుతం ఆ ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారు. లోకేష్ ఢిల్లీలో అక్కడే నివాసం ఉండబోతున్నారు.

Leave a Reply