చర్చకు రమ్మంటే పారిపోయారు..

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ అడ్డుకోవాలంటూ ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు ఎలా కోరుకుంటే నాలా నష్ట పరిహారాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు కోడిగుడ్డు మీద ఈకలుమన్ పీకుతున్నాయని, నాడు ఉద్యమంలో కలిసి రాలేదని, ప్రతి పక్షాలు అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నారు అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని గ్రామాలను ముంచి ప్రాజెక్టులు కట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, ఇప్పుడు 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురి అవుతున్నాయి అని, అందులో 6 గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా భూ సేకరణకు సహకరించారని, మరో రెండు గ్రామాల ప్రజలు కూడా భూమిని ఇచ్చేందుకు  సిద్దంగా ఉన్నారని హరీష్ రావు తెలిపారు. ఇక్కడ భూసేకరణ వద్దు అంటున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఆంద్ర ప్రదేశ్ లో రాజధాని కోసం 54 వేల ఎకరాలు ఎందుకు సమీకరించాలో స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంటే ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణలోని ప్రభుత్వం మాత్రం రైతుల కోసం రేయింబవళ్ళు కష్ట పడుతున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూములను ముంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చారని విమర్శించారు.

Leave a Reply