అధికారులపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు..

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే హరీష్ రావు మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిద్దాపూర్ లో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రాపర్తిలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించేందుకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్ లక్ష్మీభాయి మంత్రి కాన్వాయిని ఆపి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు. అందుకు ఒప్పుకున్న మంత్రి హరీష్ రావు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు సిద్దం అయ్యారు. తీరా చుస్తే అక్కడ గుంతలు తీసి లేవు. పార, నీళ్ళు కూడా లేవు. దాంతో హరీష్ రావు ఆగ్రహంతో బకరా మినిస్టర్ అనుకుంటున్నారా? ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అంటూ అక్కడ ఉన్న వారిపై మండిపడ్డారు. దాంతో ప్రిన్సిపాల్ క్షమాపణ కోరడంతో మంత్రే స్వయంగా గుంత తీసి మొక్కలు నాటారు.

 

Leave a Reply