బిల్లును ఆమోదించిన 11వ రాష్ట్రంగా తెలంగాణ..

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును ఆమోదించడానికే ప్రత్యేకంగా నేడు సమావేశమైన తెలంగాణ శాసన సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశ మంతటా ఒకే పన్ను విధానం ఉండాలంటూ గత యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు అనేక అవాంతరాలను దాటుకొని లోక్ సభలో ఆమోదం పొందింది. అయితే దేశ వ్యాప్తంగా బిల్లు అమలు జరగాలంటే 15-16 రాష్ట్రాల శాసన సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల శాసన సభలు ఆమోదించాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడంతో నేడు సమావేశమై బిల్లును ఆమోదించి, బిల్లును ఆమోదించిన 11 వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాగా బిల్లును ఆమోదించిన అనంతరం శాసన సభను స్పీకర్ మధుసూధనా చారి సభను అరగంట వాయిదా వేశారు.

Leave a Reply