ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్ రాజేవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు వెళ్ళనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీకి చేరిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం అవుతారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడి అధ్యక్షతన జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ రాజీవ్ శర్మతో కలిసి కేసీఆర్ పాల్గొంటారు. రేపు సాయంత్రం వరకు ఈ సమావేశం జగిగే అవకాశం ఉంది. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుసి రాష్ట్ర సమస్యలను వివరిస్తారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో కేసీఆర్ తమ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలను, వ్యూహాలను చర్చిస్తారు. అనంతరం మరి కొందరు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటి అయ్యి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు.

Leave a Reply