కారణం ఏమిటంటే..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్నారు. కాని కేసీఆర్ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు. కేసీఆర్ కు ఆరోగ్యం బాగా లేక పోవటమే అందుకు కారణం అని తెలుస్తుంది. గత రెండు రోజులుగా కేసీఆర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రసంగాన్ని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చదివి వినిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సర్వేలో కేసీఆర్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ప్రథమ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Leave a Reply